ఊ పిరితిత్తులు ఎంత బాగా పని చేస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. చాలా మందిలో శ్వాస సంబంధిత సమస్యలు రావడానికి కారణం..లంగ్స్ లో ఇబ్బందులు ఉండడమే. కలుషిత గాలి పీల్చడం వల్ల దుమ్ము ధూళి లంగ్స్ లోకి వెళ్తాయి. ఫలితంగా రకరకాల ఇన్ ఫెక్షన్స్ వస్తాయి. ఇవి విపరీతంగా ఇబ్బంది పెడతాయి. స్మోకింగ్ చేసే వాళ్లలో అయితే లంగ్స్ పూర్తిగా పాడైపోతాయి. చైన్ స్మోకర్స్ లో ఊపిరితిత్తులు దెబ్బ తింటాయి. వాటి పని తీరుపైనా ప్రభావం పడుతుంది. ఊపిరితీసుకోవడమూ ఇబ్బందిగా మారుతుంది. అలాంటి సమయంలో చేయాల్సిన ఒకటే ఒక పని. వీలైనంత త్వరగా లంగ్స్ ని క్లీన్ చేసుకోవడం. అంటే డిటాక్స్ చేయడం. ఇందుకు రకరకాల మందులు అందుబాటులో ఉండొచ్చు. కానీ సహజంగానే ఇంట్లోనే తయారు చేసుకోగలిగే ఓ డ్రింక్ తో సులభంగా ఈ పని స్మోకింగ్ తో లంగ్స్ కి డేంజర్
ఊపిరితిత్తుల సమస్యలు స్మోకింగ్ చేసే వాళ్లకు ఎక్కువగా వచ్చే అవకాశముంటుంది. విపరీతంగా పొగ పీల్చడం వల్ల వాటి పని తీరు దెబ్బ తింటుంది. మురికి అంతా పేరుకుపోతుంది. శ్వాస సంబంధిత సమస్యలు వెంటాడతాయి. ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు లివర్ ని వెంటనే క్లీన్ చేసుకోవాలి. అంటే అందులో ఉన్న మలినాలను తొలగించుకోవాలి. కొన్ని సింపుల్ చిట్కాలతో డిటాక్స్ చేసుకోవచ్చు అంటున్నారు న్యూట్రిషనిస్ట్. లంగ్స్ ని క్లీన్ చేసే డిటాక్స్ డ్రింక్ తయారీ విధానాన్ని ఎక్స్ ప్లెయిన్ చేశారు. పాతకాలంలో వినియోగించిన కొన్ని రకాల మూలికలతోనే ఇది తయారు చేసుకోవచ్చని వివరించారు.
కావాల్సిన పదార్థాలు
లంగ్స్ డిటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవాలంటే కేవలం మూడు పదార్థాలు అవసరం అవుతాయి. వీటిలో రెండు ఆయుర్వేద మూలికలు. వాటి పేర్లు కూడా చెప్పారు న్యూట్రిషనిస్ట్. ఒకటి పార్ స్లీ, మరోటి ఒరెగానో. ఈ రెండు పదార్థాలతో పాటు వేడి నీళ్లు ఉంటే సరిపోతుంది. లంగ్స్ లో ఎప్పటి నుంచో పేరుకుపోయిన మురికి అంతా దెబ్బకు వదిలిపోతుంది. మరి ఈ పదార్థాలను ఏ మోతాదులో తీసుకోవాలి. ఎలా వాడితే ఊపిరితిత్తులు క్లీన్ అవుతాయి. ఈ ప్రాసెస్ మొత్తం న్యూట్రిషనిస్ట్ వివరించారు. అంతే కాదు. ఈ పదార్థాలనే ఎందుకు వాడారు. వీటి వల్ల ఉపయోగాలేంటో కూడా చెప్పారు. ఇవన్నీ డిటైల్డ్ గా చూద్దాం.
ఎలా తయారు చేసుకోవాలి
ముందుగా పార్ స్లీ మూలిక తీసుకోవాలి. మోతాదు విషయానికొస్తే ఓ మూలిక తీసుకుంటే సరిపోతుంది. దీంతో పాటు ఒరెగానో మూలిక కూడా తీసుకోవాలి. ఈ రెండింటినీ మెత్తగా దంచుకోవాలి. చిన్న రోలు అందుబాటులో లేకుంటే మిక్సీలో గ్రైండ్ చేసినా సరిపోతుంది. ఈ రెండింటినీ మెత్తగా మిశ్రమంలా తయారు చేసుకోవాలి. తరవాత వడబోయాలి. వడబోసిన తరవాత వచ్చిన ఈ రసమే లంగ్స్ లో ఉన్న మలినాలను అత్యంత సహజంగా బయటకు పంపేస్తుంది. అయితే..ఇందులో ఎలాంటి పదార్థాలు కలపాల్సిన అవసరం లేదు. నిజానికి చాలా మంది తేనె కలుపుకుంటారు. కానీ ఈ డ్రింక్ ని ఇలా నేరుగానే తాగాలని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్ట్.
ఇలా తాగితే మంచిది
ఈ డ్రింక్ ని ఎలా ఉందో అలాగే తాగడం మంచిది. అయితే..ఫలితాలు ఎక్కువగా ఉండాలంటే మాత్రం ఓ చిట్కా పాటించాలి. ఓ కప్పు గోరు వెచ్చని నీళ్లతో పాటు తాగితే ఇంకా మంచిది. ఇలా చేయడం వల్ల ఈ డ్రింక్ పని తీరు రెట్టింపవుతుంది. గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏంటంటే..ఈ డ్రింక్ ని ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోకూడదు. ఇలా చేస్తే ఫలితాలు ఉండకపోవచ్చు. అయితే..వేగంగా ఫలితాలు ఉండాలంటే మాత్రం కచ్చితంగా పరగడుపున తాగాలని సూచిస్తున్నారు న్యూట్రిషనిస్ట్. పైగా ఇలా ఉదయమే తాగడం వల్ల పేగుల్లో కదలిక వస్తుంది. మలబద్ధకం సమస్య కూడా తీరిపోతుంది. ఒకటే డ్రింక్ తో రెండు రకాల ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంటుంది.
ఎలా పని చేస్తుందంటే
టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్
టర్మ్ ఇన్సూరెన్స్ - ఉచిత కోట్ పొందండి
ఎలా పని చేస్తుందంటే
పార్ స్లీ మూలికలో క్లోరోఫిల్ అధికంగా ఉంటుంది. ఇది ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతే కాదు. నేచురల్ డిటాక్స్ లా పని చేస్తుంది. ఇక ఒరెగానోలోనూ ఔషధ గుణాలున్నాయి. శ్వాస సంబంధిత సమస్యలకు ఒకప్పుడు ఈ మూలికనే వాడే వాళ్లు. వేడి నీళ్లతో తీసుకోవడం వల్ల వీటి ప్రయోజనాలు రెట్టింపు అవడంతో పాటు వేగంగా డిటాక్స్ అవుతుంది. ఊపిరి తీసుకోవడంలో తలెత్తే సమస్యలు కూడా తగ్గిపోతాయి. ఈ డిటాక్స్ డ్రింక్ ని కనీసం రెండు వారాల పాటు వాడాలి. ఆ తరవాత లంగ్స్ డిటాక్స్ అనేది మొదలవుతుంది. అయితే..రెండు వారాలకే పరిమితం చేస్తే పూర్తిగా క్లీన్ కాకపోవచ్చు. అందుకే కనీసం నాలుగు నుంచి ఆరు వారాల పాటు వాడాలని న్యూట్రిషనిస్ట్ సూచిస్తున్నారు. ఇలా చేస్తే పూర్తి స్థాయిలో లంగ్స్ క్లీన్ అయిపోతాయి.
ఎలా వాడితే మంచిది
అయితే.. ఈ డ్రింక్ ని రెగ్యులర్ గా తీసుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా తీసుకోవచ్చు. లేదా వారానికి మూడు లేదా నాలుగు సార్లు తీసుకున్నా పూర్తిగా శుభ్రంగా మారిపోతుంది. దీంతో పాటు మరి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హైడ్రేటెడ్ గా ఉండడం మంచిది. రోజూ ఏదో విధంగా వ్యాయామం చేయాలి. శరీరంలో కదలిక ఉండాలి. అల్లం, పసుపుతో తయారు చేసిన టీ తీసుకోవడం మంచిది. డీప్ బ్రీతింగ్ వ్యాయామాలు చేస్తే ఇంకా త్వరగా లంగ్ల్ క్లీన్ అవుతాయి.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa