ఇరాన్, ఇజ్రాయేల్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికు చేరుకున్నాయి. దీంతో ఇరాన్‌లోని భారతీయుల భద్రతపై ఆందోళన నెలకుంది. ఈ నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న భారతీయ విద్యార్థులను వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకురావాలని తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ రిక్వెస్ట్ చేశారు. ఇరాన్‌లోని టెహ్రాన్ యూనివర్సిటీలో 140 మంది మెడికల్ స్టూడెంట్లు సహా సహా మొత్తం 1,595 మంది విద్యార్తులు, మరో 180 మంది భారతీయ యాత్రికులు ఇరాక్‌లో చిక్కుకున్నారని తెలిపారు. ఇప్పటికే ఇరాన్‌లో భారత దౌత్యవేత్త ఆనంద్ ప్రకాశ్‌ను సంప్రదించి వారి వివరాలను అందజేశానని చెప్పారు. తక్షణమే వారిని అక్కడ నుంచి సురక్షితంగా తీసుకురావాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు.
కాగా, ఇరాన్, ఇజ్రాయేల్ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ఓ కీలక ప్రకటన చేశారు. ‘ఇరాన్‌పై జరిగిన దాడికి అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు’ అని స్పష్టం చేశారు. ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, అణు ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్ దాడులు చేసినట్లు టెహ్రాన్ ప్రకటించింది.
‘తమపై దాడికి ప్రయత్నిస్తే అమెరికా సాయుధ దళాల సంపూర్ణ బలం, శక్తి ఇరాన్‌పై ఎప్పుడూ చూడని స్థాయిలో విరుచుకుపడుతుది’ అని ట్రంప్ హెచ్చరించారు. ‘ఇరాన్‌పై జరిగిన దాడికి అమెరికాకు ఎలాంటి సంబంధం లేదు. కానీ, ఇరాన్ మా మీద ఏ రూపంలో అయినా దాడికి ప్రయత్నిస్తే, అమెరికా సైనిక శక్తి పూర్తిస్థాయిలో స్పందిస్తుంది.. అది మీరు ఎప్పుడూ చూడనిది అయి ఉంటుంది’ అని హెచ్చరికలు చేశారు.
‘‘ఇరాన్, ఇజ్రాయేల్ మధ్య ఒప్పందాన్ని తాను సులభంగా సాధించగలుగుతాను. ఈ రక్తపాతం ముగించేలా జరగడానికి నేను సిద్ధంగా ఉన్నాను’’ అని పేర్కొన్నారు. అదే సమయంలో, ఒమన్‌లో ఆదివారం జరగాల్సిన అమెరికా-ఇరాన్ అణు చర్చలు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో ‘ఇరాన్ ఒక ఒప్పందానికి రావాల్సిందే. లేకపోతే వాళ్లకు ఏమీ మిగలదు’ అని ట్రంప్ హెచ్చరించారు.
ఈక్రమంలో ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ఆదివారం తెల్లవారుజామున ప్రకటన చేస్తూ.. ‘ఇరాన్ అణు ఆయుధ ప్రాజెక్టుతో సంబంధిత టార్గెట్లపై విస్తృతమైన దాడులు పూర్తి చేశాం’ అని తెలిపింది. ఇజ్రాయేల్ లక్ష్యాల్లో ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయం, SPND అణు ప్రాజెక్టు, ఇరాన్ అణ్వాయుధాలు భద్రపరిచిన ప్రదేశం ఉన్నాయి.
అటు, ఇరాన్ సైతం మిస్సైళ్లు, డ్రోన్లను ప్రయోగించి, ఇజ్రాయేల్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలు, ఫైటర్ జెట్ ఫ్యూయల్ తయారీ కేంద్రాలపై దాడిచేసింది. ఇరాన్ దాడుల్లో కనీసం 7 మంది మృతి చెందారు, వారిలో 10 ఏళ్ల బాలుడు, 20లలో ఉన్న మహిళా ఒకరు ఉన్నారు. దాడుల అనంతరం జెరూసలేం, టెల్ అవీవ్‌లో హెచ్చరిక సైరన్లు మోగించారు.
పశ్చిమాసియాలో సంక్షోభానికి ఇజ్రాయేల్ చేపట్టిన ఆపరేషణ్ రైజింగ్ లయన్ కారణం. శుక్రవారం ఈ ఆపరేషన్ ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం: ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడం. ‘ఇజ్రాయేల్ మనుగడకే ముప్పుగా మారిన ఇరాన్ ప్రమాదాన్ని తగ్గించేందుకు ప్రారంభించాం... ఈ ముప్పు తొలగించేవరకు ఆపరేషన్ కొనసాగుతుంది’ అని స్పష్టం చేశారు. ఈ దాడుల్లో ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులు మృతిచెందారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa