ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైల్వే నుండి కీలక సమాచారం, నూతన రైళ్లు ఏర్పాటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 13, 2025, 01:09 PM

ప్రయాణికుల డిమాండ్‌ మేరకు వేర్వేరు ప్రాంతాల నుంచి 52 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేశామని దక్షిణ మధ్య రైల్వే  అధికారులు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. అక్టోబరు 5 నుంచి 27 వరకు తిరుపతి-అనకాపల్లె-తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ఈనెల 17 నుంచి నవంబరు 26 వరకు (బుధ) సంబల్‌పూర్‌- ఇరోడ్‌ (08311) మధ్య 11 రైళ్లు, ఈనెల 19నుంచి నవంబరు 28 వరకు (శుక్ర)ఇరోడ్‌- సంబల్‌పూర్‌ (08312) మధ్య 11 రైళ్లు, ఈనెల 15 నుంచి నవంబరు 24 వరకు (సోమ) విశాఖపట్నం- తిరుపతి(08583) మధ్య 11 రైళ్లు, ఈనెల 16నుంచి నవంబరు 25 వరకు (మంగళ) తిరుపతి-విశాఖపట్నం (08584) మధ్య 11 ప్రత్యేకరైళ్లు నడుస్తాయని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa