AP: భారత పురుషుల క్రికెట్ జట్టు, మహిళల హాకీ జట్టుకు సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా సోమవారం అభినందనలు తెలిపారు. ఆసియా కప్-2025లో రజత పతకం గెలిచిన మహిళల హాకీ జట్టును అభినందించారు. టీమ్ వర్క్, పోరాట స్ఫూర్తిని చూపారని తెలిపారు. భవిష్యత్‌లో మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అలాగే ఆసియా కప్-2025లో భాగంగా నిర్వహించిన టీ20 క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై గెలిచిన భారత పురుషుల జట్టుకు చంద్రబాబు అభినందనలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa