ఖతార్ తమకు అత్యంత ముఖ్యమైన మిత్రదేశమని, ఆ దేశం విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హెచ్చరించారు. ఇటీవల దోహాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో ట్రంప్ ఈ హెచ్చరికలు జారీ చేశారు. గతవారం ఖతార్ రాజధాని దోహాలోని ఓ హోటల్ పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది.ఆ హోటల్ లో హమాస్ నేతలు సమావేశమయ్యారని, వారిని మట్టుబెట్టేందుకే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ విషయంపై తమ మిత్రదేశం అమెరికాకు ముందే సమాచారం ఇచ్చామని నెతన్యాహు తెలిపారు. దీనిపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్.. దాడి చేస్తున్న విషయం తమకు ముందే తెలుసని, ఈ విషయం ఖతార్ కు కూడా తెలియజేశామని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa