గోమంగిని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేయాలని గోమంగి మండల సాధన సమితి సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు అరకులో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగానికి మంగళవారం వినతిపత్రం అందజేశారు. పరిపాలన సౌలభ్యం కల్పించడంతో పాటు ప్రజల వ్యయప్రయాసలు తగ్గుతాయని పేర్కొన్నారు. అన్ని పంచాయతీల మధ్యలో ఉండే గోమంగిని మండలంగా చేస్తే స్థానికులకు మేలు కలుగుతుందని వారు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa