ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కార్ ఉద్యోగుల సంరక్షణను పూర్తిగా గాలికి వేదిలేసిందని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ & పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడూతూ హెల్త్ స్కీంకు సంబంధించి ఉద్యోగులు తమ వంతు వాటా చెల్లిస్తూ కూడా వైద్యపరమైన బెనిఫిట్స్‌ను పొందలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఉద్యోగులపై దాడులు పెరిగిపోయాయని, పల్నాడులో పోలీస్ అధికారులపై రాజకీయ కక్షసాధింపులతో చర్యలకు తెగబడటం ఈ ప్రభుత్వ దుర్మార్గ పాలనకు నిదర్శనమని ధ్వజమెత్తారు. సచివాలయ ఉద్యోగులతో సహా మొత్తం ఉద్యోగవర్గం అంతా ఈ ప్రభుత్వ దాష్టీకాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్నాయని, ఇప్పటికైనా ఉద్యోగుల పట్ల ప్రభుత్వ తీరు మారాలని హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa