గతవారం పాకిస్థాన్‌లోని బాలాకోట్ తాలూకా సమీపంలో జరిగిన ఓ మతపరమైన సమ్మేళనం భారత్ వ్యతిరేక, జీహాదీ అనుకూల నినాదాలతో సాగినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. బాలాకోట్ సమీపంలోని గడి హబీబుల్లా పట్టణంలో నిర్వహించి 38వ ‘మిషన్ ముస్తాఫ్’ వార్షికోత్సవాన్ని మహమ్మద్ ప్రవక్త జీవితం, ఆయన బోధనల గురించి వివరించే కార్యక్రమంగా చెప్పుకున్నా.. అక్కడ జరిగింది మాత్రం భారత్‌కు వ్యతిరేక సదస్సు అని పేర్కొన్నాయి. పాక్‌లోని ప్రముఖ మతపెద్దలు పాల్గొన్న ఈ సమ్మేళనానికి సమీప ప్రాంతాల నుంచి వేలాదిగా జనం హాజరయ్యారని తెలిపాయి. మొత్తం మీద ఇది ప్రధానంగా ‘ఖాత్మే-నుబువత్’ (అంటే ప్రవక్త చివరి స్థితి) అనే ంశంపై దృష్టి సారించిందని వర్గాలు వివరించాయి.
అయితే, ఈ కార్యక్రమంలో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన కీలక నేత మసూద్ ఇలియాస్ కశ్మీరీ ప్రసంగించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2019 ఉరి, 2016 పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై దాడి సహా భారత్‌లో జరిగిన అనే ఉగ్రవాద దాడుల్లో కశ్మీరీ నిందితుడిగా ఉన్నాడు. ఉగ్రవాద భావజాలంతో ఉన్న తన ప్రసంగంలో జైషే వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్‌ను పొగడ్తల్లో ముంచెత్తాడు. ప్రపంచ ప్రతిఘటనకు అజార్ ఓ ప్రతీక అని.. అమెరికా నుంచి రష్యా వరకు ప్రపంచ శక్తులు చర్చించుకునే వ్యక్తి అని పేర్కొన్నాడు.
మసూద్ అజార్‌ను ఉగ్రవాదిగా ముద్రవేయడంపై కశ్మీరీ తీవ్ర విమర్శలు చేసినట్టు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. అంతేకాదు, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో అతడి వ్యాఖ్యలు మరోసారి పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాద పాత్రను ధ్రువీకరిస్తున్నట్టు ఉన్నాయని తెలిపాయి. దేశ సరిహద్దుల కోసం 25 ఏళ్లు పోరాటం, త్యాగాలు అని ప్రశంసించాడు.
‘ఉగ్రవాదాన్ని స్వీకరించి.. ఈ దేశ (పాకిస్థాన్) సరిహద్దులను రక్షించుకోడానికి ఢిల్లీ, కాబూల్, కాందహార్‌లో మేము పోరాడుతున్నాం.. అన్నింటినీ త్యాగం చేసిన తరువాత మే 7న భారత సైన్యాలు బాహల్పూర్‌లోని మౌలానా మసూద్ అజార్ కుటుంబాన్ని నాశనం చేశాయి’ కశ్మీరీ ఉర్దూలో ప్రసంగించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో అజార్ కుటుంబసభ్యులు హతమైన విషయాన్ని ఇల్లియాస్ కశ్మీరీ ప్రస్తావించారు. భారత సైన్యం దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అజార్ స్వయంగా వెల్లడించాడు. అయితే, సాధారణ పౌరుల మరణంపై విచారణ వ్యక్తం చేసిన భారత్.. వీటిని తగ్గించడానికి తాము అన్ని ప్రయత్నాలు చేశామని స్పష్టం చేసింది. ఉగ్రవాద శిబిరాలను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నామని తేల్చిచెప్పింది. మే 7న భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాయిద్దీన్, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన మొత్తం 9 స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. ఇందులో జైషే ప్రధాన కార్యాలయం బహావల్పూర్ ఒకటి.
నిఘా వర్గాల ప్రకారం.. ఉగ్రవాదులుగా (అంటే ‘ముజాహిదీన్’) పిలవడాన్ని ఖండించిన కశ్మీరీ.. జిహాద్‌ను మళ్లీ పునరుద్ధరించి విస్తరించాలనే పిలుపునిచ్చాడు. ఇందులో భాగంగా తన లక్ష్యం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వరకు విస్తరించాలని వ్యాఖ్యలు చేశాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa