భారత క్రికెట్ జట్టుకు కొత్త జెర్సీ స్పాన్సర్ ఖరారైంది. ప్రముఖ టైర్ల తయారీ సంస్థ అపోలో టైర్స్, టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ హక్కులను దక్కించుకుంది. ఈ ఒప్పందం 2027 వరకు కొనసాగనుంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో, ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫామ్ డ్రీమ్11తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ నేపథ్యంలో అపోలో టైర్స్ ముందుకు వచ్చింది.ఈ కొత్త ఒప్పందం ద్వారా అపోలో టైర్స్ ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐకి రూ. 4.5 కోట్లు చెల్లించనుంది. గతంలో డ్రీమ్11 ఒక్కో మ్యాచ్‌కు రూ. 4 కోట్లు చెల్లించింది. దానితో పోలిస్తే బీసీసీఐకి ఈ ఒప్పందం ద్వారా అదనపు ఆదాయం రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa