నేపాల్‌లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆ దేశ తాత్కాలిక ప్రధాన మంత్రి సుశీల కర్కితో ఫోన్‌లో మాట్లాడారు. ప్రాణ నష్టం పట్ల సంతాపం వ్యక్తం చేసిన మోదీ, నేపాల్‌లో శాంతి స్థాపన, స్థిరత్వానికి భారత్ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా మోదీ వెల్లడించారు. అదేవిధంగా నేపాల్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa