మాదకద్రవ్యాల ఉత్పత్తి, రవాణాకు ప్రధాన కేంద్రాలుగా ఉన్న దేశాల జాబితాను అమెరికా విడుదల చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా కాంగ్రెస్‌కు సమర్పించిన అధికారిక నివేదికలో మొత్తం 23 దేశాల పేర్లను వెల్లడించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, ఈ జాబితాలో భారత్‌తో పాటు పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బర్మా కూడా ఉన్నాయి. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న మాదకద్రవ్యాల ముప్పును ఎదుర్కొనేందుకు కట్టుబడి ఉన్నామని ట్రంప్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.ఈ జాబితాలో ఉన్న ఇతర దేశాలలో మెక్సికో, కొలంబియా, వెనిజులా, బొలీవియా, ఈక్వెడార్, పెరూ, పనామా, కోస్టారికా, జమైకా, లావోస్ వంటి దేశాలు ఉన్నాయి. అయితే, ఈ జాబితాలో ఒక దేశం పేరు ఉండటం అనేది ఆ దేశ ప్రభుత్వ వైఫల్యాన్ని సూచించదని అమెరికా తన నివేదికలో స్పష్టం చేసింది. భౌగోళిక, వాణిజ్య, ఆర్థిక కారణాల వల్ల కొన్ని దేశాలు మాదకద్రవ్యాల రవాణాకు అనుకూలంగా మారతాయని, అందుకే వాటిని ఈ జాబితాలో చేర్చినట్లు వివరించింది. ఆయా ప్రభుత్వాలు డ్రగ్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఈ పరిస్థితి ఉండొచ్చని పేర్కొంది.అదే సమయంలో గత 12 నెలలుగా మాదకద్రవ్యాల నియంత్రణ ఒప్పందాలను పాటించడంలో, చర్యలు తీసుకోవడంలో "దారుణంగా విఫలమైన" దేశాలుగా ఆఫ్ఘనిస్థాన్, బొలీవియా, బర్మా, కొలంబియా, వెనిజులా పేర్లను ట్రంప్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa