దసరా సందడి మధ్య పశ్చిమ బెంగాల్‌లోని అసన్సోల్లో ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. శిల్పి బాపి పాల్ వర్క్‌షాప్‌లో ఉంచిన రెండు దుర్గామాత విగ్రహాల ముఖాలు చోరీకి గురయ్యాయి. వెతికిన యజమాని, సమీపంలోని ప్రీతమ్ ఠాకూర్ వర్క్‌షాప్‌లో ఆ ముఖాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం చోరీ చేసిన వ్యక్తిని పట్టుకొని విద్యుత్ స్తంభానికి కట్టి చితకబాదారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa