ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లలు గురకపెడితే లైట్ తీసుకోవద్దు

Health beauty |  Suryaa Desk  | Published : Sat, Sep 20, 2025, 11:27 PM

పెద్దవారు ఎప్పుడైనా అలసిపోయినప్పుడు నిద్రపోతే గురక వస్తుంది. అలానే కాకుండా ఊపిరాడక ఇబ్బంది పడడం, జలుబు, ముక్కుదిబ్బడతో వస్తుంది. ఈ సమస్యని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ, అదే పిల్లల్లో గురక వస్తే అసలే వదిలేయద్దు. అది ఎడినాయిడ్స్ అనే సమస్యకి సంకేతం కావొచ్చు. కాబట్టి, ముందుజాగ్రత్త పడాలని చెబుతున్నారు డాక్టర్ వెంకట క్రిష్ణ సందీప్.


​పిల్లలకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు పేరెంట్స్ చాలా కంగారు పడతారు. అయితే, అన్నీ సమస్యలు తలనొప్పి, నొప్పుల రూపంలో రావు. కొన్ని నార్మల్ లక్షణాలు కనిపిస్తాయి. వాటిని ఏ మాత్రం నెగ్లెక్ట్ చేసినా సమస్య పెరుగుతుంది. అందులో ఒకటే పిల్లల్లో గురక. నార్మల్‌గా పిల్లలు గురక చాలా తక్కువగా పెడుతుంటారు. కానీ, అలా కాకుండా పిల్లలు ఎక్కువగా గురక పెడుతుంటే దానిని అనుమానించాల్సిందేనని చెబుతన్నారు డాక్టర్ వెంకట క్రిష్ణ సందీప్ . పిల్లల్లో గురక అనేది ఎడినాయిడ్స్‌ లక్షణం కావొచ్చు. కాబట్టి, దానిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయొద్దొని చెబుతున్నారు.


ఎడినాయిడ్స్ అంటే


ముక్కు వెనుకభాగంలో, గొంతుపై ఉండే చిన్న కణజాలాన్నే ఎడినాయిడ్స్ అంటారు. ఇవి శరీర రక్షణ వ్యవస్థలో భాగం. ముక్కు ద్వారా వచ్చే సూక్ష్మక్రిములు, వైరస్‌లను ఇవి అడ్డుకుంటాయి. పిల్లలకి చిన్న వయసులో ఇవి సహజంగానే పెద్దగా ఉంటాయి. వయసు పెరిగే కొద్దీ చిన్నగా మారతాయి. కానీ, రెగ్యులర్‌గా ఇన్ఫెక్షన్స్, అలర్జీలు వస్తే ఉబ్బి శ్వాసకోశ సమస్యల్ని తీసుకొస్తాయి.


నిద్రని ఎలా ఎఫెక్ట్ చేస్తాయి


ఎడినాయిడ్స్ ఉబ్బితే, పాక్షికంగా లేదా, పూర్తిగా నిద్రలో ఊపిరి తీసుకునే శ్వాసకోశం దారి బ్లాక్ అవుతుంది. దాంతో నిద్రలో గురక, నిద్ర సరిగ్గా లేకపోవడం, కొన్ని సార్లు ఊపిరి ఆగి తీసుకోవడం స్లీప్ ఆప్నియా, నిద్రలో శ్వాస తీసుకోలేకపోవడం, నోటి ద్వారా శ్వాస తీసుకోవడం జరుగుతుంది. దీని కారణంగా పగటిపూట చిరాగ్గా, కాన్సంట్రేషన్ తగ్గడం, చదువులో వెనకబడడం జరుగుతాయి. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి, ప్రతీ విషయాన్ని గమనించాలి.


ఇతర లక్షణాలు


గురకతో పాటు ముక్కుదిబ్బడ, ముక్కు కారడం


నోటి ద్వారా శ్వాస


గొంతు సమస్యలు, గరగరలాడటం


మింగడంలో కష్టం (డిస్ఫాజియా)


యూస్టాకియన్ ట్యూబ్ బ్లాక్ కారణంగా, తరచూ చెవి ఇన్‌ఫెక్షన్స​


ట్రీట్‌మెంట్


పిల్లలు రెగ్యులర్‌గా గురక పెడుతున్నారంటే, వెంటనే డాక్టర్ లేదా ENT స్పెషలిస్ట్‌ని కలవాలి. టెస్ట్, నాసల్ ఎండోస్కోపీ, స్కాన్ ద్వారా సమస్యని గుర్తిస్తారు. చిన్ సమస్య అయితే యాంటీహిస్టమిన్స్, యాంటీబయాటిక్స్ ఇస్తారు. కానీ, ఎడినాయిడ్స్ బాగా పెరిగి శ్వాసకోశ ఇబ్బందులు వస్తే, అడినాయిడెక్టమీ అంటే సర్జరీ అవసరం కావచ్చు.


నిర్లక్ష్యం వద్దు


పిల్లల్లో గురకని పట్టించుకోకపోతే దీర్ఘకాలంలో శారీరక ఎదుగుదల, మెదడు పనితీరు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. లక్షణాలను త్వరగా గుర్తించి, సరైన వైద్య సహాయం తీసుకుంటే, పిల్లలకి మంచి నిద్ర, సులభమైన శ్వాస, మెరుగైన జీవన ప్రమాణాలు అందుతాయి.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa