దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఆసియా కప్ సూపర్-4లో భారత్-బంగ్లాదేశ్ తలపడుతున్నాయి. లిటన్ దాస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ అఫ్గానిస్తాన్, శ్రీలంకపై విజయాలు సాధించి ఉత్సాహంగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టు ఇప్పటివరకు టోర్నీలో ఓటమి లేకుండా విజయపథంలో దూసుకెళ్తోంది. మరోవైపు ఈ పోరులో గెలిచిన జట్టు సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్‌లో స్థానం దాదాపు ఖాయం చేసుకోనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa