జీఎస్టీ సంస్కరణలతో రాష్ట్ర ప్రజలకు రూ.8 వేల కోట్ల లబ్ధి చేకూరనుందని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జీఎస్టీ సవరణ బిల్లును ఆయన శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జీఎస్టీలో విప్లవాత్మక మార్పు జరిగిందని, ఆ ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు. జీఎస్టీ లబ్ధిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేపడుతుందన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa