రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా భారత్ ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా సహకరిస్తోందని, దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ 50 శాతం సుంకం విధించారని నాటో చీఫ్ మార్క్ రుట్టే చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ల మధ్య అలాంటి సంభాషణ జరగలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతీయ ప్రయోజనాలు, ఆర్థిక భద్రత దృష్ట్యా భారత్ ఇంధన దిగుమతి నిర్ణయాలు తీసుకుంటుందని పునరుద్ఘాటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa