ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టుకు ముగ్గురు నూతన న్యాయమూర్తుల బదిలీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Oct 15, 2025, 03:35 PM

ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోద ముద్ర వేశారు. జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ దొనాడి రమేశ్, జస్టిస్ సుభేందు సామంత ఏపీ హైకోర్టులో బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నిన్న అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. వీరి రాకతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 33కి చేరనుంది.సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్. గవాయ్ నేతృత్వంలోని కొలీజియం ఆగస్టు 25న సమావేశమై ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని సిఫారసు చేసింది. ఆ సిఫారసులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa