రాజస్థాన్ రాష్ట్రంలోని రాజ్‌సమంద్ జిల్లాలో బుధవారం ఘోర ప్రమాదం తప్పింది. కెల్వా గ్రామంలో వేగంగా వచ్చిన ఓ భారీ ట్రక్కు నియంత్రణ కోల్పోయి టీ స్టాల్లోకి దూసుకెళ్లింది. ట్రక్కు రోడ్డుపై ఉన్న బారికేడ్లను ఢీకొట్టడంతో టీ షాప్ వద్ద ఉన్న ప్రజలు వెంటనే అప్రమత్తమై దూరంగా పరుగెత్తారు. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి CCTVలో రికార్డ్ అయ్యాయి. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa