నెల్లూరు టీడీపీ నేతలపై పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పౌరసఫరాల శాఖపై బహిరంగ విమర్శలు చేసిన కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని పార్టీ కేంద్ర కార్యాలయానికి రావాలని ఆర్డర్ వేసింది. ఈ ఇద్దరు నేతలు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. పార్టీ నిర్ణయాలను విస్మరించి వ్యాఖ్యలు చేయడంపై అధిష్ఠానం తీవ్రంగా స్పందించినట్లు సమాచారం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa