దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2026కు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్షల షెడ్యూల్‌ను అధికారికంగా ఖరారు చేసింది. రెండు విడతల్లో (సెషన్లలో) ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. తొలి విడత పరీక్షలు జనవరిలో, రెండో విడత ఏప్రిల్‌లో జరగనున్నాయి. విద్యార్థులు తమ సన్నద్ధతను వేగవంతం చేసేందుకు ఈ ప్రకటన ఎంతగానో దోహదపడుతుంది.ఎన్టీఏ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, జేఈఈ మెయిన్ 2026 తొలి సెషన్ పరీక్షలు జనవరి 21 నుంచి జనవరి 30 మధ్య నిర్వహిస్తారు. ఈ సెషన్‌కు హాజరు కావాలనుకునే విద్యార్థులు ఈ అక్టోబరు నుంచే తమ దరఖాస్తులను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు జరగనున్నాయి. ఈ సెషన్‌కు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జనవరి చివరి వారంలో ప్రారంభమవుతుందని ఎన్టీఏ తెలిపింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in లోని Candidate Activity విభాగం ద్వారా సమర్పించవచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa