దీపావళి సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ పర్వదినాన్ని జరుపుకుంటున్న ప్రతీ అమెరికన్‌కు ఆయన తన శుభాకాంక్షలు తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.చీకటిపై వెలుగు సాధించిన విజయానికి దీపావళి పండుగ నిదర్శనమని ట్రంప్ అభివర్ణించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకునే ఈ వేడుక, ఆశ నుంచి బలాన్ని పొందేందుకు, నూతన స్ఫూర్తిని నింపుకొనేందుకు దోహదపడుతుందని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు."కోట్లాది మంది ప్రజలు దీపాలు, లాంతర్లు వెలిగించి జరుపుకునే ఈ పండుగ, చెడుపై మంచి ఎల్లప్పుడూ విజయం సాధిస్తుందనే సత్యాన్ని గుర్తు చేస్తుంది" అని ట్రంప్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa