ఆంధ్రప్రదేశ్‌పై 'మొంథా' తుపాను ప్రభావం చూపే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్ర పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం, ఆమె ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించాల్సి ఉంది.బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడి, ఈ నెల 28వ తేదీన ఉత్తర కోస్తాంధ్రలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తుపాను ప్రభావంతో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రమంత్రి పర్యటన వాయిదా వేశారు.నిర్మలా సీతారామన్ అమరావతిలో ఒకే రోజున 12 జాతీయ బ్యాంకుల ప్రాంతీయ ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అయితే, తాజా వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయడమే సరైనదని భావించారు. త్వరలోనే పర్యటనకు సంబంధించిన కొత్త తేదీని ఖరారు చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa