జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలు భారీ ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌ను చేపట్టాయి. లోయ వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తృతంగా నిర్వహిస్తున్న సోదాల్లో భాగంగా నిన్న ఒక మహిళ సహా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్ నేడు కూడా కొనసాగుతోంది. ఉగ్రవాదుల కదలికలపై అందిన పక్కా సమాచారంతో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.ఇంటెలిజెన్స్ వర్గాల నివేదికల ప్రకారం ఎత్తైన పర్వత ప్రాంతాల్లో క్రియాశీలంగా ఉన్న ఉగ్రవాదులు శీతాకాలం సమీపిస్తుండటంతో మైదాన ప్రాంతాల్లో సురక్షితమైన ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ సమాచారం ఆధారంగా భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. రాంబన్, కిష్త్వార్, దోడా, కథువా, రియాసి, పూంచ్, రాజౌరి జిల్లాల్లోని డజన్ల కొద్దీ ప్రదేశాలలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.ఆదివారం ప్రారంభమైన ఈ దాడులు, సోదాలు నేడు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అనుమానిత స్థావరాలపై భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఉగ్రవాదుల ప్రణాళికలను భగ్నం చేసి, వారిని ఏరివేయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ జరుగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa