ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తుపాను నేపథ్యంలో అతలాకుతలం అవుతున్న ఫిలిప్పీన్స్‌

international |  Suryaa Desk  | Published : Mon, Nov 10, 2025, 03:47 PM

ద్వీప దేశం ఫిలిప్పీన్స్‌ను మరో పెను తుపాను అతలాకుతలం చేస్తోంది. ఇటీవలే ‘కల్మేగి’ తుపాను సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకోకముందే, ‘ఫుంగ్-వాంగ్’ (ఉవాన్) అనే సూపర్ టైఫూన్ దేశంపై విరుచుకుపడింది. సోమవారం ఉదయం అరోరా ప్రావిన్స్‌లోని దినాలుంగన్ పట్టణం వద్ద ఇది తీరం దాటింది. ఆ సమయంలో గంటకు 185 కిలోమీటర్ల స్థిరమైన వేగంతో గాలులు వీచాయని, వాటి తీవ్రత గరిష్ఠంగా గంటకు 230 కిలోమీటర్ల వరకు చేరిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.ఇటీవలి కాలంలో ఫిలిప్పీన్స్‌ను తాకిన అత్యంత శక్తిమంతమైన తుపాను ఇదేనని నిపుణులు చెబుతున్నారు. ఫుంగ్-వాంగ్ దాదాపు 1800 కిలోమీటర్ల వెడల్పున విస్తరించి ఉండటంతో దేశంలోని మూడింట రెండొంతుల భూభాగాన్ని ప్రభావితం చేయవచ్చని అంచనా వేస్తున్నారు. కాగా, అక్టోబర్ 7న సంభవించిన ‘కల్మేగి’ తుపాను కారణంగా ఇప్పటికే 224 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో భారీ విపత్తు ముంచుకురావడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఫుంగ్-వాంగ్ ప్రభావంతో ఇప్పటికే ఇద్దరు మరణించారు. కాటాండూన్స్ ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుని ఒకరు మరణించగా, సమర్ ప్రావిన్స్‌లో ఓ మహిళపై శిథిలాలు పడటంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa