అన్నింటికంటే ఆరోగ్యం ఎంత ముఖ్యమైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే, చాలా మంది కూడా హెల్త్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తమ డైట్‌లో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు. సరైన ఫుడ్ టేస్టీగా అనిపించకపోయినా తినడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి హెల్దీ ఫుడ్స్‌లో ఓట్స్ ఒకటి. ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ ఓట్స్‌ని మనం రెగ్యులర్‌గా తీసుకుంటే బరువు తగ్గడం మాత్రమే కాదు. గుండెకి మేలు చేస్తుంది. పైగా బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా కంట్రోల్ అవుతాయి. వీటితో పాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. ఇన్ని లాభాలున్న ఓట్స్‌ని ఎంత పరిమాణంలో ఏ రకం ఓట్స్ తినాలో చెబుతున్నారు డాక్టర్ గౌతమ్. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ వీడియోలో ఆయన ఓట్స్ గురించి ముఖ్యమైన విషయాలని షేర్ చేసుకున్నారు. ఇవన్నీ తెలుసుకునే ముందు ఓట్స్‌తో ఏయే లాభాలో కూడా వివరంగా తెలుసుకుందాం.
చెడు కొలెస్ట్రాల్ తగ్గడం
ఓట్స్ తినడం వల్ల కలిగే ముఖ్య లాభాల్లో ఒకటి చెడు కొలెస్ట్రాల్ తగ్గడం. చెడు కొలెస్ట్రాల్ కారణంగా గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. గుండె పనితీరు సరిగా ఉండదు. చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ధమనుల్లో ఫలకం పేరుకుపోయి రక్తప్రసరణ సరిగ్గా జరగక గుండె సమస్యలొస్తాయి. కాబట్టి, చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించుకోవాలి. దానికి ఓట్స్ బాగా హెల్ప్ చేస్తాయి. రెగ్యులర్‌గా తింటే చెడు కొలెస్ట్రాల్ ఈజీగా తగ్గి గుండె ఆరోగ్యం మెరగవుతుంది.
డయాబెటిస్ ఉన్నవారికి
షుగర్ ఉన్నవారికి కూడా ఓట్స్ చాలా మంచివి. వీటిలో బీటా గ్లూకాన్ ఉంటుంది. దీని వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. షుగర్ ఉన్నవారు రెగ్యులర్‌గా తింటే రక్తంలో షుగర్ లెవల్స్ చాలా వరకూ తగ్గుతాయి. బీటా గ్లూకాన్ అనేది ఓ ఫైబర్. ఇవి. జెల్‌లా ఉండి జీర్ణ వ్యవస్థని మెరుగ్గా చేస్తుంది. దీని వల్ల కడుపులో మెల్లిగా జీర్ణమవుతుంది ఆహారం. దీంతోపాటు పాటు షుగర్ రక్తంలోకి ఫాస్ట్‌గా కాకుండా మెల్లిగా అబ్జార్బ్ అవుతుంది. రెగ్యులర్‌గా ఓట్స్ తింటే ఇన్సులిన్‌కి మీ బాడీ రియాక్షన్ మెరుగ్గా మారుతుంది. అంతేకాకుండా, ఇందులోని హై ఫైబర్ కంటెంట్ మీకు త్వరగా కడుపు నిండిన ఫీలింగ్‌ని ఇస్తుంది. దీంతో ఎక్కువగా తినరు. ఓట్స్‌లో ఓ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నెమ్మదిగా, క్రమంగా పెరుగుతాయి.
బరువు తగ్గడం
ఓట్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల మనం తినగానే కడుపు నిండుగా అనిపిస్తుంది. వేరే క్రేవింగ్స్ రావు. దీంతో హెల్దీగా బరువు తగ్గుతారు. దీంతో పాటు క్రేవింగ్స్ తగ్గుతాయి. అంతేకాకుండా బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది. అయితే, వీటిని మనం ప్లెయిన్‌గా తీసుకుంటేనే రిజల్ట్ ఉంటుంది. వీటిపై నుంచి హై కేలరీ టాపింగ్స్ వేయొద్దు. షుగర్, సిరప్ వంటివి వేయొద్దు. వీటిని ఓట్మీల్, ఓవర్‌నైట్ ఓట్స్, ఉప్మా వంటివి చేసుకుని తినొచ్చు.
జీర్ణ వ్యవస్థకి
ఓట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈజీగా డైజేషన్ అవుతుంది. దీనిలో సోల్యూబుల్ ఫైబర్, ముఖ్యంగా బీటా గ్లూకాన్‌లో మన కడుపులో జెల్‌లా ఏర్పడి మలాన్ని మృదువుగా చేస్తాయి. దీంతో మలబద్ధకం సమస్య ఉండదు. అంతేకాకుండా, ఇందులోని ఫైబర్ గట్ బ్యాక్టీరియాకి హెల్ప్ చేస్తుంది. వీటిని మనం ఉడికించి తీసుకోవడం వల్ల ఈజీగా జీర్ణమవుతుంది. కొంతమంది వాటిని పచ్చిగా తీసుకుంటే బ్లోటింగ్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, వీటిని ఉడికించి లేదా రాత్రంతా నానబెట్టి తీసుకోవడం మంచిది. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్స్, బి విటమిన్స్, ఎనర్జీ బ్రెయిన్‌ని బూస్ట్ చేస్తాయి. ఇవన్నీ కూడా బ్రెయిన్‌ని హెల్దీగా మారుస్తాయి.
ఎలా తీసుకోవాలి?
ఓట్స్ తీసుకోవాలి. కానీ, ఎలా తీసుకోవాలో కొంతమందికి తెలియదు. అరకప్పు పచ్చి ఓట్స్‌ని తీసుకోవాలి. వీటిని ఉడికిస్తే కప్పు పరిమాణంలో మారతాయి. వీటిని వారానికి 4 నుంచి 5 సార్లు తీసుకోవాలి.
షుగర్ ఉన్నవారు, బరువు తగ్గాలనుకునేవారు రోజూ తీసుకుంటే మంచిది.
బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి.
ఓట్స్ తింటే లాభాలు, ఎలా తింటే మంచిదంటే
ఏ ఓట్స్
అయితే, మార్కెట్లో మనకి చాలా రకాల ఓట్స్ ఉంటాయి. ఇందులో చాలా మంది క్విక్ ఓట్స్‌ని వాడతారు. అవి ఇన్‌స్టంట్‌గా చేసుకునేలా ఉటాయి. ఇవి కాకుండా మనకి స్టీల్ కట్ ఓట్స్, రోల్డ్ ఓట్స్, క్విక్ ఓట్స్ వంటి రకాలు ఉంటాయి. ఇందులో రోల్డ్ ఓట్స్ బెస్ట్ అని చెబుతున్నారు గౌతమ్.
అదే విధంగా, మరీ చిన్న పిల్లలకి కాకుండా 6 నెలల కంటే పెద్ద వయసున్నవారికి ఇవ్వడం మంచిది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa