క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు, యువ ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో మరో జట్టుతో తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జరిగిన ట్రేడింగ్‌లో అతడిని ముంబై ఇండియన్స్ లక్నో సూపర్ జెయింట్స్ బదిలీ చేసింది. ఈ ట్రేడ్ అర్జున్ ప్రస్తుత ధర అయిన రూ. 30 లక్షలకే జరిగింది.2021 నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో ఉన్న అర్జున్, 2023లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్‌లు ఆడి 3 వికెట్లు పడగొట్టాడు. జట్టును వీడుతున్న సందర్భంగా అర్జున్ సోషల్ మీడియాలో ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టాడు. ఈ జ్ఞాపకాలకు ధన్యవాదాలు. ముంబై జట్టులో భాగం కావడం గౌరవంగా భావిస్తున్నాను. త్వరలోనే లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని పేర్కొన్నాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa