సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన పలువురు ఉమ్రా యాత్రికులు మరణించడం పట్ల మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "సౌదీలో జరిగిన ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ కష్ట సమయంలో మృతుల కుటుంబాలకు నా ప్రార్థనలు ఉంటాయి" అని జగన్ పోస్ట్ చేశారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయం అందించాలని, మృతదేహాలను గౌరవప్రదంగా స్వదేశానికి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa