రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 మార్చిలో నిర్వహించనున్న నేపథ్యంలో, తేదీల ఖరారుపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. మార్చి 16, మార్చి 21 తేదీలతో రెండు టైంటేబుళ్లను రూపొందించి ప్రభుత్వానికి పంపించారు. ఈ రెండింటిలో దేనికి అనుమతి వస్తే ఆ ప్రకారంగా పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.50 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు విద్యాశాఖ వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa