AP: తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ప్రమాదం చోటుచేసుకుంది. హరిణి ప్రాంతం వద్ద బైక్‌పై ప్రయాణిస్తున్న లోకేష్ అనే వ్యక్తిపై రాయి పడింది. బైక్ నడుపుతుండగా ఈ రాయి తగలడంతో ఆయన బ్యాలెన్స్ కోల్పోయి కిందపడిపోయాడు. ఈ ఘటనలో లోకేష్ తలకు, శరీరానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అక్కడి భద్రతా సిబ్బంది మొదట అశ్వినీ ఆసుపత్రికి, అనంతరం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. వైద్యులు బాధితుడికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa