హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో ఈ రోజు ఉదయం ఏపీ పోలీసులు వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే ఇంటి తలుపులు తన్ని, లోపలికి చొరబడి అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వైసీపీ నేతలు తీవ్రంగా మండిపడుతూ, ప్రస్తుత ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని ఆరోపించారు.
వెంకట్ రెడ్డి అరెస్టుకు కారణంగా అనంతపురం జిల్లాలో జరిగిన పరకామణి సతీష్ మరణం కేసు పేర్కొంటున్నారు పోలీసులు. ఈ ఘటనలో తప్పుడు, దుష్ప్రచారం చేస్తూ వైసీపీ నేతలు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేశారని టీడీపీ నాయకులు ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు వెంకట్ రెడ్డిపై కేసు నమోదైందని, దర్యాప్తు కోసం అదుపులోకి తీసుకున్నామని అధికారులు తెలిపారు.
వైసీపీ వర్గాలు మాత్రం ఈ అరెస్టును “రాజకీయ ప్రతీకార చర్య”గా అభివర్ణిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపైనా ఇలాంటి దమనకాండ కొనసాగుతోందని, మాటతోనే కాదు చట్టంతోనూ గొంతు బిగిస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో #RedBookRajyam ట్రెండింగ్లో నిలిచింది. వెంకట్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ శ్రేణులు రంగంలోకి దిగాయి. మరోవైపు టీడీపీ నేతలు ఇది చట్టబద్ధమైన చర్యే అంటూ సమర్థిస్తున్నారు. రాజకీయ ఆరోపణల మధ్య ఈ కేసు ఇక ఎటు పయనిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa