విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల కదలికలు తీవ్ర కలకలం రేపాయి. అత్యంత పకడ్బందీగా అందిన సమాచారంతో కేంద్ర, రాష్ట్ర బలగాలు సంయుక్తంగా చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 27 మంది మావోయిస్టులు పట్టుబడ్డారు. కానూరు కొత్త ఆటోనగర్ ప్రాంతంలోని ఓ భవనాన్ని షెల్టర్‌గా మార్చుకుని కార్యకలాపాలు సాగిస్తున్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ జాయింట్ ఆపరేషన్‌లో కేంద్ర బలగాలతో పాటు ఆక్టోపస్, గ్రేహౌండ్స్ దళాలు పాల్గొన్నాయి. పోలీసు వర్గాల కథనం ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ మావోయిస్టుల బృందం సుమారు పది రోజుల క్రితం విజయవాడకు చేరుకుంది. తాము కూలీ పనుల కోసం వచ్చామని స్థానికులను నమ్మించి, ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అయితే, వీరి కదలికలపై అనుమానం రావడంతో నిఘా వర్గాలు సమాచారం సేకరించాయి. దీని ఆధారంగా బలగాలు మంగళవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని మెరుపుదాడి చేశాయి. ఈ ఆపరేషన్‌లో 12 మంది మహిళలు, నలుగురు కీలక స్థాయి నేతలతో పాటు 11 మంది మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa