వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సుదీర్ఘ కాలం తర్వాత అక్రమాస్తుల కేసులో రేపు (గురువారం) హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించడంతో, కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరుకాలేదని, ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన భౌతికంగా హాజరుకావడం తప్పనిసరి అని సీబీఐ వాదించింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం, నవంబర్ 21లోగా వ్యక్తిగతంగా హాజరుకావాలని జగన్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో, గడువుకు ఒకరోజు ముందే ఆయన కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa