ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినియోగదారుల భద్రత నేపథ్యంలో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ప్రవేశపెట్టిన జోహో

national |  Suryaa Desk  | Published : Wed, Nov 19, 2025, 01:37 PM

ప్రముఖ దేశీయ టెక్నాలజీ సంస్థ జోహో (Zoho) తన మెసేజింగ్ యాప్ 'అరట్టై' (Arattai) వినియోగదారుల భద్రతను మరింత పటిష్ఠం చేసింది. యాప్‌లో ఎంతో కీలకమైన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ (E2EE) ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్లు తాజాగా ప్రకటించింది. ఈ నూతన అప్‌డేట్‌తో వినియోగదారుల మధ్య జరిగే ప్రత్యక్ష సంభాషణలకు పూర్తిస్థాయి గోప్యత, భద్రత లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.ఈ నూతన ఫీచర్‌ను పొందేందుకు వినియోగదారులందరూ తమ అరట్టై యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని జోహో సూచించింది. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ఇద్దరు వినియోగదారుల మధ్య జరిగే సంభాషణలను పంపినవారు, స్వీకరించినవారు మినహా మరెవరూ చదవలేరు. చివరికి సర్వీస్ అందిస్తున్న జోహో సంస్థ కూడా ఆ సందేశాలను పొందడం సాధ్యం కాదని వివరించింది. వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యత పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారుల డేటా భద్రతే లక్ష్యంగా ఈ కీలకమైన అప్‌డేట్‌ను తీసుకువచ్చినట్లు జోహో తెలిపింది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa