ఆస్ట్రేలియాలోని సిడ్నీలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అదుపుతప్పిన ఓ కారు ఢీ కొట్టడంతో భారత సంతతికి చెందిన 8 నెలల గర్భిణి మరణించింది. భర్తతో కలిసి వాకింగ్ చేస్తున్న సమయంలో కారు ఢీ కొట్టడంతో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన సమన్విత ధరేశ్వర్ సిడ్నీలోని ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో సిస్టమ్ అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. భర్త, మూడేళ్ల బాబుతో పాటు సిడ్నీలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. ఈ క్రమంలోనే కిందటి వారం భర్త, కొడుకుతో కలిసి సమన్విత వాకింగ్ కు వెళ్లారు. ఆ సమయంలో ఓ బీఎండబ్ల్యూ కారు అతివేగంగా దూసుకొచ్చింది.అదుపుతప్పి పార్కింగ్ లాట్ లోని మరో కారును ఢీ కొట్టింది. దీంతో ఆ కారు కదిలి ముందున్న సమన్వితను బలంగా తాకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సమన్వితను వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఆమె మరణించింది. సమన్వితను కానీ ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డను కానీ కాపాడలేకపోయామని వైద్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa