దివిసీమ ఉప్పెన సమయంలో మాజీ మంత్రి మండలి వెంకటకృష్ణారావు చేసిన సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. బుధవారం అవనిగడ్డలోని గాంధీ క్షేత్రంలో జరిగిన ఉప్పెన మృతుల సంస్మరణ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 1977వ సంవత్సరంలో దివి సీమ ఉపెన కారణంగా పదివేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa