ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌లో 14 ఏళ్ల బాలికపై పక్కింటి 40 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్భవతి అని తేలడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. బాధిత కుటుంబం పంచాయితీ పెద్దలను ఆశ్రయించగా, వారు అబార్షన్ చేయించి, నిందితుడిని పెళ్లి చేసుకోవాలని తీర్పు చెప్పారు. బాలిక కుటుంబం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించడంతో, వారిని ఊరి నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa