దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలతో నష్టాల్లో ప్రారంభమైనప్పటికీ, ఐటీ, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు పుంజుకున్నాయి. ఈ క్రమంలో నిఫ్టీ మళ్లీ 26 వేల మార్కును అధిగమించింది. సెన్సెక్స్ 513.45 పాయింట్లు లాభపడి 85,186.47 వద్ద స్థిరపడగా, నిఫ్టీ 142.60 పాయింట్ల నష్టంతో 26052.65 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 88.58గా నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa