గాజా స్ట్రిప్‌లోని రఫా నగరంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) ఓ భారీ సొరంగాన్ని కనుగొన్నాయి. 2014 నాటి యుద్ధంలో మరణించిన ఇజ్రాయెల్ సైనికాధికారి లెఫ్టినెంట్ హదర్ గోల్డిన్ మృతదేహాన్ని హమాస్ ఇటీవలి వరకు ఈ సొరంగంలోనే దాచిపెట్టినట్లు ఐడీఎఫ్ గురువారం వెల్లడించింది. ఈ సొరంగానికి సంబంధించిన వీడియోను ఎక్స్‌లో పంచుకుంది. ఈ సొరంగం రద్దీగా ఉండే నివాస ప్రాంతాలతో పాటు ఐక్యరాజ్యసమితి కార్యాలయం (యూఎన్ఆర్డబ్ల్యూఏ), మసీదులు, క్లినిక్‌లు, కిండర్గార్టెన్ల కింద నుంచి వెళ్తోందని పేర్కొంది.ఈ సొరంగం 7 కిలోమీటర్ల పొడవు, 25 మీటర్ల లోతులో ఉందని, ఇందులో దాదాపు 80 గదులు ఉన్నాయని ఐడీఎఫ్ వివరించింది. ఆయుధాలు నిల్వ చేయడానికి, దాడులకు ప్రణాళికలు రచించడానికి, సుదీర్ఘకాలం పాటు తలదాచుకోవడానికి హమాస్ కమాండర్లు దీనిని ఉపయోగించేవారని తెలిపింది. ఇజ్రాయెల్ దళాలు ఈ సొరంగంలో హమాస్ సీనియర్ కమాండర్ల కమాండ్ పోస్టులను గుర్తించాయి.ఈ కేసుకు సంబంధించి, లెఫ్టినెంట్ గోల్డిన్ మృతి వ్యవహారంలో ప్రమేయమున్న మర్వాన్ అల్-హమ్స్ అనే హమాస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేసినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. గోల్డిన్ మృతదేహాన్ని ఎక్కడ ఖననం చేశారో అతడికి తెలిసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa