టీటీడీ అవినీతి ఆరోపణలకు కేంద్రంగా మారిన మార్కెటింగ్ విభాగాన్ని ప్రక్షాళన చేసేందుకు ధర్మకర్తల మండలి నడుం బిగించింది. ఏటా సుమారు రూ. 700 కోట్లకు పైగా కొనుగోళ్లు జరిపే ఈ కీలక విభాగంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ఠమైన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది.గతంలో ఈ విభాగంలో జరిగిన అవకతవకలు, నాణ్యతలేని సరుకుల కొనుగోళ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రూ. 350 విలువ చేసే శాలువాలను రూ. 1,300కు కొనుగోలు చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు స్వయంగా వెల్లడించడం గమనార్హం. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ ఆధారంగా ఇప్పటికే కొందరు సిబ్బందిని బదిలీ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa