ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రెయిన్ ట్యూమర్ ఉంటే కనిపించే లక్షణాలు ఇవే

Health beauty |  Suryaa Desk  | Published : Sun, Nov 30, 2025, 11:36 PM

మెదడులో కణితి ఏర్పడడం అనేది చాలా ప్రమాదకరం. దీని వల్ల మరణం కూడా రావొచ్చు. మెదడులో కణితి ఏర్పడితే కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని అస్సలు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కొన్నిసార్లు ఇది ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. బ్రెయిన్ ట్యూమర్ అనేది మెదడులో లేదా, కణాల దగ్గర కణితి పెరగడం. మెదడు కణితులు వచ్చే ప్రాంతంలో నరాలు, పిట్యూటరీ గ్రంథీ, పీనియల్ గ్రంథి, మెదడు ఉపరితలాన్ని కప్పి ఉంచే పొరలు ఉంటాయి. మెదడులో కణితులు బ్రెయిన్‌లో మొదలవుతాయి. కొన్నిసార్లు క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాల నుండి బ్రెయిన్‌కి వ్యాపిస్తాయి. వీటినే మెదడు కణితులు అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు కొన్ని లక్షణాలు ఉంటాయి. వాటిని ముందుగా గుర్తించడం చాలా ముఖ్యం. అవేంటంటే


తలనొప్పి, ఒత్తిడి పెరగడం


బ్రెయిన్‌లో ట్యూమర్ పెరిగితే తలనొప్పి పెరుగుతుంది. ఒత్తిడిగా అనిపిస్తుంది. తలనొప్పి తగ్గేందుకు ఏ ట్యాబ్లెట్ వేసుకున్నా, బామ్ రాసినా నొప్పి తగ్గదు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంటుంది. తల పగిలిపోయేంతగా తలనొప్పిగా ఉంటుంది. అస్సలు భరించలేరు. కొన్నిసార్లు అప్పుడప్పుడు నొప్పిగా ఉంటుంది. కొన్నిసార్లు వచ్చి అలానే ఉంటుంది.


వాంతులు, నీరసంగా మారడం


అదే విధంగా, వాంతులు అవుతుంటాయి. కడుపులో నొప్పి తిప్పినట్లుగా ఉంటుంది. ఏం తిన్నా అది జీర్ణమవ్వదు. వాంతులు వస్తుంటాయి. కాబట్టి, తలనొప్పి ఉండి వాంతులు అవుతుంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ముందుగానే అలర్ట్ అవ్వాలి.


కంటి సమస్యలు, దృష్టి తగ్గడం


అదే విధంగా, బ్రెయిన్ ట్యూమర్ ఉన్నప్పుడు దృష్టి సమస్యలు వస్తాయి. సరిగ్గా చూడలేరు. స్పష్టంగా కనిపించదు. మనం ఏం చూసినా అది బ్లరీగా అనిపిస్తుంది. ఏదైనా చూసినా రెండుగా కనిపించడం, అసలే కనిపించకపోవడం వంటి సమస్యలొస్తాయి. మొత్తంగా, అవయవాల పనితీరు తగ్గుతుంటుంది. రోజుకో సమస్య వస్తుంటుంది.


భుజాలు, కాళ్లని కదపలేకపోవడం


బ్రెయిన్ ట్యూమర్ ఉంటే భుజాలు, చేతులు, కాళ్ళని కదపలేకపోతారు. అస్సలు మూమెంట్ ఉండదు. కాస్తా నడవలన్నా, కదలాలన్నా కూడా అస్సలు కాళ్ళు చేతులు సహకరించవు. మూమెంట్ తగ్గుతుంది. కొద్ది దూరం కూడా నడవలేరు. అస్సలు లేచి సరిగ్గా లేచి నిలబడడం కష్టంగా మారుతుంది. బ్యాలెన్స్, కో ఆర్డినేషన్ తగ్గుతుంది. అప్పటివరకూ ఉన్నవారు ఒక్కసారిగా వారి బిహేవియర్‌లో తేడా ఉంటుంది. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు.


మాట్లాడడంలో కష్టంగా అనిపించడం


అదే విధంగా, బ్రెయిన్‌లో ట్యూమర్ ఉంటే మాట్లాడడంలో కూడా ఇబ్బందిగా ఉంటుంది. మాట తడబడుతూ వస్తుంది. నత్తిగా మాట్లాడతారు. సరైన విధంగా మాట్లాడలేరు. తడబడుతూ మాట్లాడుతుంటారు. మతిమరుపు కూడా ఎక్కువగా ఉంటుంది. ప్రతీ చిన్న విషయాన్ని మర్చిపోతుంటారు.


వినికిడి లోపాలు


అదే విధంగా, ఎదుటివారు మాట్లాడిన మాటల్ని బ్రెయిన్ ట్యూమర్ ఉంటే వినలేరు. నీరసంగా, అలసటగా కనిపిస్తారు. ఎక్కువగా ఆకలిగా అనిపించడమే కాకుండా బరువు పెరుగుతారు. చిన్న చిన్న విషయాల్ని కూడా అర్థం చేసుకోలేరు.


బ్రెయిన్ ట్యూమర్ ఎందుకొస్తుంది?


బ్రెయిన్ ట్యూమర్ రావడానికి స్పష్టమైన కారణాలు ఇంతవరకూ స్పష్టంగా తెలియదు. కానీ, కొన్ని అధ్యయనాల ప్రకారం, DNA చేంజెస్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. వయసు కారణంగా, కొన్ని ఇన్ఫెక్షన్ష్ కారణంగా కెమికల్ ఎక్స్‌పోజర్స్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa