ప్రస్తుత కాలంలో సెల్‌ఫోన్లు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అవసరమైన వస్తువుగా మారిపోయాయి. వినియోగదారులు తమ ఆర్థిక స్థాయికి అనుగుణంగా ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. అందుకే ప్రధాన స్మార్ట్‌ఫోన్ కంపెనీలు కొత్త ఫీచర్లు కలిగిన ఫోన్లను తరచుగా విడుదల చేస్తూ వినియోగదారులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నాయి.సాధారణంగా 5G ఫోన్ల ధరలు రూ.14,000–రూ.16,000 మధ్య ఉంటాయి. అయితే, రెడ్‌మీ తక్కువ ధరకే అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్లను అందిస్తుంది. తాజాగా షావోమి సంస్థ తన రెడ్‌మీ బ్రాండ్‌లో రెడ్‌మీ 15C మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది గత సంవత్సరం విజయవంతమైన రెడ్‌మీ 14Cకి అప్‌గ్రేడ్ వెర్షన్. డిస్‌ప్లే, బ్యాటరీ, డిజైన్, సాఫ్ట్‌వేర్ వంటి విభాగాల్లో గణనీయమైన మెరుగుదలలతో ఈ ఫోన్ ప్రత్యేకతను అందిస్తుంది. రూ.15,000 లోపు రేంజ్‌లో రియల్‌మీ P4x, ఇన్‌ఫినిక్స్ హాట్ 60i, ఒప్పో K13 వంటి ఫోన్లకు ఇది బలమైన పోటీగా నిలుస్తుంది. సెప్టెంబర్‌లో గ్లోబల్ లాంచ్ అయిన ఈ మోడల్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది.
*రెడ్‌మీ 15C 5G ముఖ్య ఫీచర్లు:ఫోన్‌లో MediaTek Dimensity 6300 చిప్‌సెట్ వాడబడింది. ఇది గేమింగ్ ప్రదర్శనకు అనుకూలంగా రూపకల్పన చేయబడింది, అలాగే పవర్ ఎఫిషియెన్సీ కూడా బాగా ఉంది. 5G నెట్‌వర్క్‌లో స్థిరమైన కనెక్టివిటీని అందించగలదని కంపెనీ వెల్లడించింది.డిస్‌ప్లే విషయంలో, 6.9 అంగుళాల HD+ స్క్రీన్ బడ్జెట్ ఫోన్లలో అరుదుగా పెద్దదిగా ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ స్మూత్ స్క్రోలింగ్ అందిస్తుంది, 240Hz టచ్ శాంప్లింగ్ గేమింగ్ సమయంలో వేగవంతమైన ప్రతిస్పందన ఇస్తుంది. 810 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల బయట వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది.బ్యాటరీ సామర్థ్యాన్ని , 6,000mAh పెద్ద బ్యాటరీ ఒకసారి ఛార్జ్ చేస్తే రోజంతా ఉపయోగించడానికి సరిపోతుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది.కెమెరా విషయంలో, 50MP రియర్ కెమెరా AI ఎన్హాన్స్‌మెంట్‌తో స్పష్టమైన ఫోటోలు తీయగలదు. 8MP ఫ్రంట్ కెమెరా స్టడీ సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం అనుకూలంగా ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో అవసరమైన కెమెరా ప్రమాణాలను ఇది పూర్తిగా కలిగి ఉంది.కనెక్టివిటీ మరియు అదనపు ఫీచర్లలో బ్లూటూత్ 5.4, Wi-Fi సపోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్, IP64 రేటింగ్ (స్ప్లాష్ & డస్ట్ ప్రొటెక్షన్), సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, AI ఫేస్ అన్‌లాక్, హై-రెసల్యూషన్ ఆడియో సపోర్ట్ ఉన్నాయి.
*వేరియంట్లు మరియు ధరలు:Moonlight Blue, Dusk Purple, Midnight Black
4GB + 128GB – రూ.12,499
6GB + 128GB – రూ.13,999
8GB + 128GB – రూ.15,499
డిసెంబర్ 11 నుండి ఈ ఫోన్ Amazon, Mi.com మరియు రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa