ఇటీవల స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఒరియెంటియా సూసుగముషి అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఈ అంటువ్యాధి, చిన్న నల్లులు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. నల్లి కుట్టిన చోట నల్లటి మచ్చ, తీవ్రమైన జ్వరం, తలనొప్పి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సకాలంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకం కావచ్చు. లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే ప్రమాదం 2% వరకు తగ్గుతుంది. పొలాల్లో పనిచేసేవారు, పశువులను చూసుకునేవారు, గ్రామీణ ప్రాంతాలవారు జాగ్రత్తగా ఉండాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa