రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కొనసాగుతోంది. రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ ఘనస్వాగతం పలికారు. శుక్రవారం జరిగే ద్వైపాక్షిక సంబంధాల్లో 2 బిలియన్ డాలర్ల జలాంతర్గాముల లీజు ఒప్పందం, ముడి చమురు దిగుమతులు, రష్యాలో భారతీయ కార్మికులకు ఉద్యోగావకాశాలు, భారత్ నుంచి రష్యాకు ఫార్మా, వ్యవసాయ, ఆహార, వినియోగ వస్తువుల ఎగుమతులపై కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. రాత్రి 9 గంటలకు పుతిన్ రష్యాకు బయల్దేరి వెళ్లనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa