AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లపై రాత్రిపూట భారీ వాహనాల రాకపోకలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు లారీలు, బస్సులు వంటి హెవీ వాహనాలు ఘాట్ రోడ్లలోకి ప్రవేశించకూడదని ఆదేశించింది. ప్రమాదాలు నివారించేందుకు ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి రాగా, నియమాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa