ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ ఒకే ఒక వ్యాయామం, 15 రోజుల పాటు చేస్తే ఫ్యాట్ ఐస్‌లా కరిగిపోతుంది

Life style |  Suryaa Desk  | Published : Sun, Dec 14, 2025, 10:54 PM

ఈ రోజుల్లో చాలా మంది అధిక కొవ్వు సమస్యతో బాధపడుతున్నారు. అది బెల్లీ ఫ్యాట్, తొడల దగ్గర పెరిగిన కొవ్వు, హిప్ ఫ్యాట్ ఏదైనా కావచ్చు. వివిధ భాగాల్లో కొవ్వు ఎక్కువ పేరుకుపోవడం ఆరోగ్యాన్ని నాశనం చేయడమే కాకుండా.. శరీర ఆకృతిని కూడా పాడు చేస్తుంది. ఎబ్బెట్టుగా కనిపించేలా చేస్తుంది. అందుకే పెరిగిన కొవ్వును తగ్గించుకోవాలి. ఇది ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా.. మిమ్మల్ని ఫిట్‌గా మారుస్తుంది. ఇక, కొవ్వు తగ్గడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తారు. కొందరు తిండిలో మార్పులు చేసుకుంటారు. మరికొందరు జిమ్‌లో గంటల తరబడి కష్టపడుతుంటారు. అయితే, ఒక్కసారి కొవ్వు పేరుకుపోతే కరిగించడం చాలా కష్టంగా ఉంటుంది.


ప్రసవం తర్వాత చాలా మంది మహిళలు బరువు పెరుగుతారు. ఇక, ఆఫీసుల్లో పనిచేసే మగవారికి కూడా కడుపు, తుంటి, తొడల దగ్గర కొవ్వు పెరుగుతుంది. జిమ్‌కి వెళ్లడానికి సమయం దొరకదు. అలాంటి వారి కోసం ఒకే ఒక వ్యాయామాన్ని షేర్ చేసుకున్నారు ఫిట్‌నెస్ కోచ్ రితికా కె బలూజా. ఈ వ్యాయామాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు. 15 రోజుల పాటు ఈ వ్యాయామం చేస్తే కడుపు, తుంటి, చేతులు, తొడలపై కొవ్వు మాయమవుతుంది. ఇంతకీ ఆ వ్యాయామం ఏంటి, ఎలా చేయాలన్న పూర్తి వివరాలపై తెలుసుకుందాం.


ఇంతకీ ఆ వ్యాయామం ఏంటి?


ఫిట్నెస్ కోచ్ రితిక ఇన్‌స్టాగ్రామ్‌లో హై నీ లిఫ్ట్ వ్యాయామం చేస్తున్న వీడియోను షేర్ చేసింది. అంటే మోకాలితో చేసే వ్యాయామం. ఈ వ్యాయామం 15 రోజుల్లో బెల్లీ, చేయి, తొడ, తుంటి కొవ్వును తగ్గించడంలో సాయపడుతుందని రితిక తెలిపారు ఈ వ్యాయామం చేయడం కూడా చాలా సులభం. ఆమె ప్రకారం ఈ వ్యాయామాన్ని 15 రోజుల పాటు చేయాలి. అంతేకాకుండా రోజుకు 100 సార్లు చేయాలి.


వ్యాయామం ఎలా చేయాలి?


ఈ వ్యాయామం చేయడానికి ముందుగా మీరు నిటారుగా నిలపబడాలి. ఆ తర్వాత కుడివైపు మోకాలి.. పైకి ఎత్తి.. రెండు చేతుల్ని నేరుగా నడుము వరకు తీసుకురావాలి. ఇలా ఒక కాలుతో 50 సార్లు చేయాలి. ఆ తర్వాత మరొక కాలుతో 50 సార్లు రిపీట్ చేయాలి. మొదటి 50 సార్లు చేసి కావాలంటే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ఈ వ్యాయామాన్ని ఉదయం లేదా సాయంత్రం చేయవచ్చు. అయితే, మంచి ఫలితాలు ఉండాలంటే దీన్ని 15 రోజులు క్రమం తప్పకుండా చేయాలని ఎక్స్‌పర్ట్ అంటున్నారు.


వ్యాయామం చేసే విధానం


​ఈ వ్యాయామంతో ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి?


​ఈ వ్యాయామం రెగ్యులర్‌గా చేయడం వల్ల కొవ్వు కరగడంతో పాటు శరీర నొప్పులు కూడా మాయమవుతాయి.


​వెన్ను నొప్పితో బాధపడేవారికి ఇది బెస్ట్ వ్యాయామం. ముఖ్యంగా మహిళలు, ఆఫీసుల్లో పనిచేసే వారు ఈ వ్యాయామం చేయడం మంచిది.


మోకాలు హైగా లిఫ్ట్ చేయడం వల్ల శరీరంలోని కండరాలు, ఎముకలు స్ట్రాంగ్ అవుతాయి.


కాళ్లను బలపేతం చేయడానికి కూడా ఈ వ్యాయామం ప్రయోజనకరంగా ఉంటుంది.


గంటల తరబడి కూర్చొని పనిచేసేవారికి ఈ వ్యాయామం చాలా మంచిది. ఇది మీ భంగిమను మెరుగుపర్చడంలో సాయపడుతుంది.


గుర్తించుకోవాల్సిన విషయాలు


​మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఈ వ్యాయామం చేసే ముందు వైద్యులు లేదా నిపుణుడ్ని సంప్రదించండి.


ఈ వ్యాయామంతో పాటు సరైన జీవనశైలి పాటించడం కూడా చాలా ముఖ్యమని గుర్తించుకోండి. జంక్ ఫుడ్, వేయించిన ఆహారాలు, షుగరీ డ్రింక్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. సమతుల్య ఆహారాన్ని తినండి. తాజా పండ్లు, కూరగాయలు, గింజలు, విత్తనాలు, తృణధాన్యాలు వంటి వాటిని భాగం చేసుకోండి.


ఈ వ్యాయామంతో పాటు రోజు వాకింగ్ చేయండి. వాకింగ్ వల్ల ఫ్యాట్ తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.


యోగా కూడా సాయపడుతుంది


బెల్లీ ఫ్యాట్‌, తొడల దగ్గర కొవ్వు తగ్గించేందుకు కొన్ని ఆసనాలు కూడా మీకు సాయపడతాయి. ఉత్కటాసనం, వజ్రాసనం, త్రికోణాసనం, దేవియసనం, బద్దకోణాసనం వంటి యోగాసనాలు మీకు సాయం చేస్తాయి. ఈ ఆసనాలు రెగ్యులర్‌గా వేయడం వల్ల బెల్లీ ఫ్యాట్‌తో పాటు తొడల దగ్గర కొవ్వు తగ్గుతుంది. ఇక, బరువు పెరగడంలో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రాణాయామం, ధ్యానం వంటి వాటిని భాగం చేసుకోండి.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa