అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ నివాసంపై దాడి జరిగిన ఉదంతం కలకలం రేపుతోంది. ఒహియోలోని సిన్సినాటి నివాసంపై దాడి జరగడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ దాడిలో పలు కిటికీలు ధ్వంసం అయ్యాయి. ఘటన సమయంలో కుటుంబ సభ్యులెవరూ ఇంట్లో లేకపోవడంతో వారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లయింది. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. ఈ దాడి వెనుక ఉన్న ఉద్దేశంపై అధికారులు ఆరా తీస్తున్నారు.
జేడీ వాన్స్ ఇల్లే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక నివేదికలు తెలుపుతున్నాయి. నిందితుడు ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టినట్లు అక్కడి ఫోటోల ద్వారా స్పష్టం అవుతోంది. అయితే నిందితుడు ఇంటి లోపలికి ప్రవేశించలేదని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యుడైన వ్యక్తిని పోలీసులు వెంటనే వెంబడించి అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.
ఈ దాడి ఉద్దేశపూర్వకంగా జేడే వాన్స్, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో అమెరికా సీక్రెట్ సర్వీస్, స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa