కొత్త ఏడాదిలో కొత్త లక్ష్యాలు, కొత్త పెట్టుబడులను నిర్దేశించుకుంటారు. అయితే, సురక్షితమైన పెట్టుబడి అయిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకే ఎక్కువ మంది మొగ్గు చూపుతుంటారు. సేవింగ్స్ అకౌంట్ల నుంచి డబ్బులు తీసి ఫిక్స్‌డ్ డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డేటా ప్రకారం బ్యాంకుల్లోని డిపాజిట్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వాటానే 62 శాతంగా ఉంది. పొదుపు ఖాతాలతో పోలిస్తే ఇందులో ఎక్కువ వడ్డీ రావడం ప్రధాన కారణం. చాలా బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలపై 2-3 శాతం వడ్డీ ఇస్తాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు అయితే 6-8 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఎలాంటి రిస్క్ లేకుండా మంచి వడ్డీ వస్తుందని ఫిక్స్‌డ్ డిపాజిట్లుచేస్తుంటారు. ప్రస్తుతం చాలా బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లు చెల్లిస్తున్నాయి. దీంతో వచ్చే రాబడి తగ్గిపోతోంది. మార్కెట్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లకు మించి రాబడులు అందించే ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అందులోని నాలుగు ముఖ్యమైన ఆప్షన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1.ఇండెక్స్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే ఇండెక్స్ ఫండ్ డబ్బులను కూడా షేర్లలో పెట్టుబడిగా పెట్టవచ్చు. అయితే, ఇండెక్స్ ఫండ్లకు ఫండ్ మేనేజర్ ఉండరు. వీటి ద్వారా పెట్టే పెట్టుబడులు ఆటోమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ల రూపంలో ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ స్థిరమైన, సురక్షితమైన రాబడులను పొందడమే లక్ష్యంగా ఉంటాయి. సెన్సెక్స్ 30లో కొన్ని కంపెనీల వెయిటేజ్ చూడవచ్చు. రిలయన్స్ ఇండస్ట్రీలో 13.65, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో 9.65 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 8.78 శాతం, ఇన్ఫోసిస్ 8.70 శాతం, టీసీఎస్ 5.13 శాతం మేర పెట్టుబడులు పెడతున్నారు. అంటే కంపెనీల వెయిటేజీ ప్రకారం మీ డబ్బులు పెట్టుబడిగా వెళ్తాయి. ఒక వేళ కంపెనీ వెయిటేజీ మారితే దానిలోని డబ్బులు విత్ డ్రా చేసి ఇతర కంపెనీలో ఇన్వెస్ట్ చేయవచ్చు. లాభాలు ఇచ్చే కంపెనీలో ఇందులో ఉంటాయి.
2. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్
ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ అచ్చంగా ఇండెక్స్ ఫండ్స్ మాదిరిగానే ఉంటాయి. ఈ రెండూ పలు కంపెనీలు, రంగాల్లో ఇన్వెస్ట్ చేసేందుకు అనుమతి ఇస్తాయి. వీటి మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంటుంది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఎంపిక చేసుకున్న ఇండెక్స్ కి దగ్గరా ఉంటాయి. ఇండెక్స్ ఫండ్స్ కంటే మెరుగైనవిగా చెబుతారు. అయితే ఇందులో సిప్ ఆప్షన్ ఉండదు. ఇందులో యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. ఇండెక్స్ కనీస ధరను బట్టి ఫండ్ యూనిట్ మొత్తాన్ని నిర్ణయిస్తారు.
3.డిబెంచర్ మ్యూచువల్ ఫండ్స్
డిబెంచర్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఫండ్ మేనేజర్‌ని నియమిస్తారు. అతను మీ డబ్బుతో బాండ్లు కొనుగోలు చేసి ఆ బాండ్లపై వచ్చే వడ్డీని పరిహారంగా చెల్లిస్తారు. అంటే లోన్ లాంటి ట్రాన్సాక్షన్ అన్నమాట. ఈ ఫండ్లలో ఫండ్ మేనేజర్ పాత్ర కీలకం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌తో పోలిస్తే తక్కువ రాబడి ఉన్నప్పటికీ రిస్క్ తక్కువగా ఉంటుంది. కానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే వీటిల్లో వచ్చే రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి.
4. గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్
గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి డెట్ మ్యూచువల్ ఫండ్లలో ఒక రకం. ఇవి ప్రభుత్వ బాండ్లలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తాయి. వీటిపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుంది. ఇందులో నష్ట భయం చాలా తక్కువ ఉంటుంది. సెబీ రూల్స్ ప్రకారం గిల్ట్ ఫండ్స్ పోర్టు ఫోలియోలోని 80 శాతం తప్పనిసరిగా ఇన్వెస్ట్ చేయాలి. ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే గిల్ట్ ఫండ్స్ మంచి రాబడులను అందిస్తాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa