AP: వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ‘గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ’, 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యంతో చేపడుతున్న ప్రాజెక్టుల పురోగతిపై విస్తృతంగా చర్చించారు. అటవీ, పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్ దండే ఈ సమీక్షకు హాజరుకాగా, అటవీశాఖ సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్ చలపతిరావు తదితర అధికారులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa