శాస్త్రవేత్తలకు దశాబ్దాలుగా అంతుచిక్కని బెటెల్గ్యూస్ నక్షత్రం, ఏదో రోజు సూపర్ నోవాగా పేలిపోతుందని భావిస్తున్నారు. నాసా హబుల్ టెలిస్కోప్ పరిశోధనలో, ఈ రెడ్ సూపర్‌జాయింట్ నక్షత్రం పేలుడుకు సిద్ధంగా ఉందని తేలింది. బెటెల్గ్యూస్ వెనుక భాగంలో గ్యాస్ ప్రవాహం అసమానంగా, వంకరగా ఉండటానికి కారణం, దాని గురుత్వాకర్షణ ప్రభావంతో మలుపులు తిప్పుతున్న ఒక రహస్య సహచర నక్షత్రం అని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నక్షత్రం మన సూర్యుడి కన్నా 700-1000 రెట్లు పెద్దది. ఇది పేలిపోతే చంద్రుడి కన్నా ప్రకాశవంతంగా కనిపిస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa