సాధారణంగా ముఖంపై లేదా బుగ్గలపై పిగ్మెంటేషన్ స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో ముఖంపై నల్లటి మచ్చలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ కొన్నిసార్లు పెదాలపై కూడా పిగ్మెంటేషన్ ఏర్పడవచ్చు. దీని కారణంగా మీ శుభ్రమైన పెదాలు కూడా నల్లగా కనిపించడం ప్రారంభిస్తాయి. పుట్టుకతోనే పెదాల రంగును మార్చలేమనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ బాహ్య కారణాల వల్ల పెదాల రంగు నల్లగా మారుతుంటాయి.
సూర్యరశ్మి ప్రభావం, తేమ లేకపోవడం, సిగరెట్లు కాల్చడం, అధిక కెఫిన్ వినియోగం, పెదాలపై లిప్ స్టిక్ ఎక్కువగా వాడటం వల్ల పెదాలు నల్లగా మారుతుంటాయి. నల్లగా మారిన పెదాల్ని గులాబీ రంగులోకి మార్చడానికి కొన్ని సహజ చిట్కాలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఆ చిట్కాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నిమ్మకాయ, తేనె మిశ్రమం
రుచిలో పుల్లగా, ఆమ్లంగా ఉండే నిమ్మకాయ దాని బ్లీచింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. తేనె హ్యూమెక్టెంట్‌గా పనిచేస్తుంది. సహజంగానే పెదాలకు కావాల్సిన తేమను అందిస్తుంది. పెదాలు పొడిబారకుండా నివారిస్తుంది. నిమ్మకాయను తేనెతో కలిపి వాడటం వల్ల పెదాల నల్లటి రంగును తగ్గించవచ్చని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఒక టీస్పూన్ తేనెను సమాన మొత్తంలో నిమ్మరసంతో కలపండి. దానిని మీ పెదాలపై అప్లై చేసి, సున్నితంగా రుద్దండి, ఆపై కనీసం 15 నుంచి 20 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయండి. ఈ నివారణను వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించండి.
అలోవేరా జెల్ కూడా బాగా పనిచేస్తుంది
సాధారణంగా కలబందలో చర్మానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి పెదాల్ని పగలకుండా కాపాడతాయి. అలోవెరాలోని విటమిన్లు పెదాలకు పోషణనిచ్చి కాంతివంతం చేస్తాయి. దీన్ని రోజూ అప్లై చేయడం వల్ల ప్రయోజనకరంగా ఉంటుంది.
కలబంద గుజ్జును రాత్రి పూట పెదాలకు లిప్ మాస్క్‌లా అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల పెదాలకు కావాల్సినంత తేమ అందుతుంది. ఇది పెదాల్ని హైడ్రేట్ చేస్తుంది. దీంతో నల్లటి రంగులో ఉన్న మీ పెదాలు పింక్ కలర్‌లోకి మారతాయి.
నల్లటి పెదాల్ని గులాబీ రంగులోకి మార్చే టిప్స్
బీట్‌రూట్ బామ్ లేదా పేస్ట్
బీట్‌రూట్ ముదురు గులాబీ రంగులో ఉంటుంది. ఇది పెదాలకు సహజమైన రంగుని ఇస్తుంది. దీన్ని పెదాలకు అప్లై చేయడానికి బీట్‌రూట్‌ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్లెండర్‌లో రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను పెదాలకు అప్లై చేసి, 8 నుంచి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆపై పెదాల్ని శుభ్రం చేసుకోవాలి.
ఆ తర్వాత పెదాల్ని క్లీన్ చేసుకోవాలి. నెక్ట్స్ లిప్ బామ్ లేదా పెట్రోలియం జెల్లీని అప్లై చేయాలి. మీరు కావాలంటే బీట్‌రూట్ రసాన్ని కొంచెం కొబ్బరి నూనె లేదా షియా బటర్‌తో కలిపి లిప్ బామ్ చేసుకోవచ్చు. దీన్ని రోజూ పెదాలకు వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
పసుపు, పాలు చేసే మ్యాజిక్
పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. పసుపులో ఉండే కర్కుమిన్ అనే శక్తివంతమైన సమ్మేళనం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల్ని కలిగి ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. ఇందుకోసం చిటికెడు పసుపును అర చెంచా పచ్చి పాలలో కలపండి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పెదాలకు మూడు నుంచి ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోండి. ఆ తర్వాత వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల పెదాలపై నల్లటి రంగు తొలగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ చిట్కాలు కూడా బాగా పనికొస్తాయి
గులాబీ రేకులను కొన్ని గంటలు పాలలో నానబెట్టి.. ఆ తరువాత వాటిని రుబ్బుకోవాలి. ఈ పేస్ట్‌ను మీ పెదాలకు అప్లై చేయండి. గులాబీ రేకులు మీ పెదాలకు సహజ రంగు, తేమను అందిస్తుంది.
ప్రతి రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెతో మీ పెదాలను సున్నితంగా మసాజ్ చేయండి. దీనివల్ల మీ పెదవులు మృదువుగా, గులాబీ రంగులోకి మారతాయి.
ఉపయోగించిన గ్రీన్ టీ బ్యాగులను చల్లబరిచి, వాటిని మీ పెదాలపై కొన్ని నిమిషాలు ఉంచండి. ఇవి పొడిబారడం, నల్లటి పెదాల్ని తగ్గించడంలో సాయపడతాయి.
పెదాల సహజ రంగును కాపాడుకోవడానికి హైడ్రేటెడ్ గా ఉండటం ముఖ్యం. రోజూ 8-10 గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం.
తినడానికి రుచికరంగా ఉండే స్ట్రాబెర్రీల్ని లిప్ మాస్క్ తయారు చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. ఈ లిప్ మాస్క్ సిద్ధం చేయడానికి, స్ట్రాబెర్రీలను చూర్ణం చేయండి. ఈ మిశ్రమానికి బేకింగ్ సోడా వేసి పేస్టులా చేసుకోండి. ఈ పేస్టును పెదాలపై 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత పెదాల్ని వాష్ చేసుకోండి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa